హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వండి: ఎస్సై

NLR: బుచ్చి పట్టణంలోనీ కామాక్షి‌నగర్‌లో చెత్త ఏరుకునేలాగా వచ్చి దొంగతనానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకుని ఎస్ఐ ఉమా శంకర్ దొంగతనాలపై ఆరా తీశారు. సీసీ కెమెరాలు పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వీధిలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.