హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుళ్లిన వ్యర్థాలతో చేపల పెంపకం

NTR: నందిగామలో కుళ్లిన కోళ్ల వ్యర్థాలను బహిరంగంగా తరలిస్తూ, చేపల చెరువులకు మేతగావాడుతున్నారు. భారత్ టాకీస్ సెంటర్ వంటి ప్రాంతాల్లో చికెన్ దుకాణాల నుంచి సేకరించిన వ్యర్థాలను నాలుగైదు రోజులు నిల్వ ఉంచి, పురుగులు పట్టిన స్థితిలో బొలెరో వాహనాల్లో తరలిస్తున్నారు. వీటిని తిని పెరిగిన చేపల వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.