హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో ఏపీ జేఏసీ నిరసన

కడప కలెక్టరేట్ ఆవరణలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. “సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి” అంటూ నినదించారు. జీపీఎఫ్‌, సరెండర్ లీవ్‌లు, ఏపీజీఎల్‌ఐ బకాయిలు, పెండింగ్ డీఏను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలని కోరారు.