హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్వేటినగరంలో ఓటర్ల జాబితాపై గ్రామసభ

CTR: కార్వేటినగరం మేజర్‌ పంచాయతీలో SC, ST, BC ఓటర్ల జాబితాపై గురువారం డిప్యూటీ MPDOమధుసూదన్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. DPO సుధాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను గురువారం నుంచి 6వ తేదీ వరకు స్వీకరించి పరిష్కరిస్తామని డీపీవో తెలిపారు. 7వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.