హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీ నూతన ఓటర్ల జాబితా ప్రదర్శన

అనంతపురం: గుంతకల్లు మున్సిపాలిటి ఓటర్ల జాబితాను గురువారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో 37 వార్డులను పునర్వ్యవస్థీకరణ తర్వాత 48 వార్డులకు సంబంధించి ఓటర్ జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శనకు ఉంచామన్నారు. మొత్తం 1,13,855 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో సరి చూసుకోవాలన్నారు.