హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెంటపాడు నల్లరాయి క్వారీకి నో పర్మిషన్

ASR: చింతపల్లి పంచాయతీ పరిధిలోని పెంటపాడు నల్లరాయి క్వారీ తవ్వకాలకు పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పంచాయతీ అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ గురువారం పేర్కొన్నారు. క్వారీలకు అనుమతులు ఇచ్చే అధికారం పంచాయతీకి లేదని ఆయన స్పష్టం చేశారు. క్వారీ వ్యవహారంపై మైనింగ్ శాఖ, జాయింట్ కలెక్టర్ స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.