హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగాలపాడులో ఓటర్ల జాబితా పై గ్రామ సభ

కృష్ణా: నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాపై గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి, నందిగామ ఎంపీడీవో వి.ఎస్.హెచ్.వి.యం. ప్రసాదరావు ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాను పరిశీలించారు. జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో గ్రామసభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ తీర్మానం చేశారు.