హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఎస్ పేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

నెల్లూరు: ఆత్మకూరు నూతన డీఎస్పీ వెంకటేశ్వర్లు ఏఎస్ పేట పోలీస్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. స్టేషన్లోని పరిస్థితులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందితో శాంతి భద్రతలు అంశంపై చర్చించారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న ఏఎస్ పేటపై ప్రత్యేక దృష్టి సారించి భద్రతా చర్యలు చేపడతామని డీఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు.