హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ జలాశయాలకు నీటిని వదలాలి: కాటసాని

NDL: శ్రీశైలం జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ గోరుకల్లు, వెలుగోడు జలాశయాలకు నీటిని విడుదల చేయకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురువారం వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. వెంటనే నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని ఈమేరకు కాటసాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.