హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.50 వేల సాయం

తూ.గో: సీతానగరం మండలం ముగ్గళ్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న గోకవరం మండలానికి చెందిన బీజేపీ నాయకులు, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు.