హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెల్ట్ షాప్ రద్దు చేయాలని మహిళల ఆందోళన

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం తక్కెళ్లపాడులో పాఠశాల సమీపంలోని అక్రమ బెల్టు షాప్‌ను తొలగించాలంటూ స్థానిక మహిళలు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు, విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తక్షణమే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.