హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర అన్నదాన పథకానికి భారీ విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కాతేరు వాస్తవ్యులు బొల్లి రత్నాజీ రావు కుటుంబ సభ్యులు రూ.1,11,116 విరాళాన్ని గురువారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.