అన్నమయ్య: మదనపల్లె మున్సిపాలిటీలో 48 వార్డులకు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 1,16,958 మంది ఓటర్లు ఉండగా.. 56,862 మంది పురుషులు, 60,083 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,221 మంది అధికంగా ఉన్నారు. సవరణలకు ఫారం-8, కొత్త నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ప్రమీల సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె ఓటర్ల జాబితా విడుదల


