హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో పోలీసుల తనిఖీలు.. 75 బైక్‌లు సీజ్

సత్యసాయి: ఎస్పీ సతీష్‌ కుమార్‌ పర్యవేక్షణలో ధర్మవరంలోని వివిధ కాలనీల్లో గురువారం కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. రానున్న గణేష్‌ ఉత్సవాలు, ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని 75 బైక్‌లు, 11 ఆటోలు, కారు, అక్రమ క్రాకర్స్‌ సీజ్‌ చేశారు. రౌడీషీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్‌ ఇచ్చి, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.