NTR: గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో రూ.36 లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రాథమిక వైద్యం అందితే ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ ఆరోగ్య కేంద్రాలతో మెరుగైన సేవలు: ఎమ్మెల్యే


