హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి'

ప్రకాశం: కనిగిరి పట్టణంలో గురువారం సామాజిక శంఖారావం నిరసన ర్యాలీ కెవిపిఎస్, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు పిసి కేశవరావు మాట్లాడుతూ.. దళిత కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సామాజిక న్యాయం పాటిస్తూ పట్టణంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు.