హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో డ్రోన్లు, స్మార్ట్‌ గ్లాసెస్‌ స్వాధీనం

TPT: తిరుమల ఆలయ పరిసరాల భద్రత, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ భద్రతా సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగించే అవకాశం ఉన్న 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయ పరిసరాల్లో అనుమతి లేకుండా డ్రోన్లు, రికార్డింగ్‌ పరికరాలు వినియోగించవద్దని టీటీడీ సూచించింది.