విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 10, 11న 'సాహిత్య సమ్మేళనం 2026' జరగనుంది. ఈ రెండు రోజుల్లో కథ, కవిత్వం, పాట అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు, వర్ధమాన కవులతో ఇష్టాగోష్టి ఉంటాయి. ఈ వేడుకలో యువ సృజనకారులు, సాహితీవేత్తలు పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ సాహితీ సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'సాహిత్య సమ్మేళనాన్ని విజయవంతం చేయండి'


