KMR: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తాడ్వాయికి చెందిన జీవన్, అదే మండలంలోని బ్రహ్మాజీపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఇద్దరినీ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
తెలంగాణ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు


