హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మున్సిపాలిటీలో వృథాగా పోతున్న మంచినీరు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శారద నగర్ రెండవ లైన్‌లో మంచి నీరు వృథాగా పోతుంది. పైప్ లైన్ లీకేజీ తో సమస్య ఎదురయిందని స్థానికులు తెలిపారు. వృథాగా పోతున్న నీరుతో ఆ ప్రాంతమంతా బురదమయంగా తయారైందని పేర్కొన్నారు. సచివాలయం ఇంజనీరింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజ్ అరికట్టాలని వారు కోరుతున్నారు.