హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు అనుచరులతో కొండా సురేఖ భేటీ

WGL: హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ వరంగల్‌కు చెందిన అనుచరులతో నేడు కీలక సమావేశం కానున్నారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, పార్టీ అంతర్గత అంశాలను వారికి వివరించనున్నట్లు సమాచారం. తనపై కుట్ర జరుగుతోందని సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం, ఇతర మంత్రులపై ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.