హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగదేవ్‌పూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ప్రవేశాలు

SDPT: జగదేవ్‌పూర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్ఎసీ, వీటీతో పాటు, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని ప్రిన్సిపల్ చాందీ కుమారి తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 7 వరకు ప్రవేశాలకు గడువు ఉన్నందున విద్యార్థులు త్వరగా కళాశాలను సంప్రదించాలని కోరారు.