హైదరాబాద్: 28°C
తెలంగాణ

పచ్చదనం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: ఎస్సై

PDPL: జూలపల్లి మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 75వ వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీరామ్, అటవీ అధికారులు, పోలీసులు, గ్రామస్థులు మొక్కలు నాటారు. పచ్చదనం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, ప్రతి ఇంటా మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.