హైదరాబాద్: 28°C
వార్తలు

5న శ్రీరామ్‌ కాలేజీకి మోదీ

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీ వర్సిటీ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌ని సందర్శించనున్నారు. సెప్టెంబర్ 5న జరిగే కళాశాల శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. యువతతో మమేకం కావాలన్న బీజేపీ లక్ష్యానికి చేరువ కావాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగం ఉండనుంది. చివరిసారిగా 13 ఏళ్ల క్రితం గుజరాత్ సీఎం హోదాలో ఈ కాలేజిని మోదీ సందర్శించారు.