హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెయిన్ అలర్ట్.. జిల్లాలో భారీ వర్షం..?

JGL: జిల్లాలో రానున్న గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా గాలులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు.