HNK: వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై బుధవారం హన్మకొండలో ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, సీపీ శ్వేతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. భద్రత, శాంతిభద్రతలు,ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. మండపాలు, నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.
తెలంగాణ
గణపతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు


