హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌స్టేషన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ASF: తిర్యాణి మండలం చింతపల్లి సబ్‌షన్ PTR లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటల కారణంగా మండలవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్, పోలీసు శాఖల ఉన్నతాధికారులు సబ్‌స్టేషన్ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.