ASF: సిర్పూర్ (T) మండలం వెంకట్రావుపేట్ X రోడ్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 4 ఆవులను ఇరుకైన స్థితిలో, ఆహారం, నీరు లేకుండా తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నట్లు ఎస్సై సాగర్ తెలిపారు. నిందితులు ఎండీ కైఫ్, అబ్దుల్ ఖురేషి, ఖాజా యాకూబుద్దీన్‌ను అరెస్టు చేసి ఆవులు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. బుధవారం వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అక్రమ గో రవాణా.. ముగ్గురికి రిమాండ్


