హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒంటరి జీవితంపై విరక్తి.. యువకుడి ఆత్మహత్య!

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన పిట్టల సాగర్ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందడంతో మనస్తాపానికి గురైన సాగర్ ఈ నెల 1న కాల్వ కట్ట వద్ద పురుగుల మందు తాగాడు. అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బంధువు రత్నాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.