హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ కల్లు విక్రయం.. ఇద్దరిపై బైండ్ డౌన్

ADB: తలమడుగు మండలంలో అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరిపై బైండ్ డౌన్ చర్యలు చేపట్టినట్లు SI రాధిక బుధవారం తెలిపారు. మండలంలోని కోడద్‌కు చెందిన శ్రీనివాస్‌కు రూ.50 వేలు, దేవాపూర్‌కు చెందిన నారాయణస్వామికి రూ.10 వేల జరిమానా విధించి MRO రాజమోహన్ ఎదుట హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని SI హెచ్చరించారు.