హైదరాబాద్: 28°C
తెలంగాణ

BC, SC స్టడీ సర్కిళ్ల ఆధునీకరణకు పెద్దపీట: కలెక్టర్

ADB: ఆదిలాబాద్‌లో ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలకు దీటుగా బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను బుధవారం ఆదేశించారు. తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు, ఇన్వర్టర్లు, తాగునీటి ప్లాంట్, రీడింగ్ కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ ప్రత్యేక శిక్షణ అందించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.