హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

JGL: కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్డులో ఎత్తు పోల్స్ ఏర్పాటు పనులు చేపట్టనున్న నేపథ్యంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీ రోడ్, కమ్యూనిస్టు ఏరియా, ఐబీ గెస్ట్ హౌస్, వెంకటేశ్వర ఆలయం, వేములవాడ రోడ్డు, సివిల్ హాస్పిటల్, గోవిందగిరి నగర్, ఫిష్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేయనున్నట్లు తెలిపారు.