హైదరాబాద్: 28°C
తెలంగాణ

షీ టీమ్స్ ఆధ్వర్యంలో కళాశాలలో స్పెషల్ డ్రైవ్

MDK: శంకరంపేట(ఆర్) విద్యార్థులకు భద్రత, రక్షణ పట్ల చైతన్యం తెచ్చేందుకు తూప్రాన్ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో శంకరంపేట(ఆర్) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. T-SAFE యాప్ ప్రాధాన్యత, సైబర్ క్రైమ్స్, బాలల అక్రమ రవాణా నిరోధక చర్యల గురించి వివరించారు. మహిళల సురక్షిత జీవనం, బాలల భద్రతే పోలీసుల ప్రధాన ఆశయమని తెలిపారు.