హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు గుంతలో పడి వ్యక్తి మృతి

WGL: చెరువు గుంతలో పడి రాజమొగిలి (55) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండిలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో బుధవారం గేదెలను మేత నిమిత్తం బయటకు తోలుకెళ్లాడు. సాయంత్రానికి గేదెలు ఇంటికి చేరినా రాజమొగిలి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా రాత్రి సమయంలో గ్రామంలోని పెద్ద చెరువులోని ఓ గుంతలో మృతి చెంది కనిపించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.