హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: SI

KNR: శంకరపట్నం మండల ప్రజలు నేషనల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కేశవపట్నం పోలీసులు కోరారు. ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు హుజురాబాద్ కోర్టు సముదాయంలో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు SI శేఖర్ రెడ్డి తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, ట్రాఫిక్, పెటీ, ఎక్సైజ్ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.