హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే శాఖకు మానవ హక్కుల కమిషన్‌ షాక్‌

కేరళలో అర్ధరాత్రి ఓ మహిళను రైలు నుంచి దింపిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. ప్రయాణికురాలి భద్రత, గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించినందుకు రైల్వే శాఖ ఆమెకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.