హైదరాబాద్: 28°C
వార్తలు

పెళ్లి పేరుతో మోసం.. బీఆర్‌ఎస్‌ నేతపై కేసు

TG: పెళ్లి పేరుతో మోసం చేసి రూ.30 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికే పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కులం పేరుతో దూషించడంతో SC, ST అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.