హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసం.. ఖాతా నుంచి రూ.60,823 కట్

NZB: కోటగల్లీకి చెందిన ఓ వ్యక్తి PayTM మేనేజర్ పేరుతో వచ్చిన ఫేక్ కాల్‌కు స్పందించి సైబర్ మోసానికి గురయ్యాడు. KYC అప్‌డేట్ పేరుతో OTP చెప్పడంతో అతడి ఖాతా నుంచి రూ.60,823 కట్ అయ్యాయి. వెంటనే 1930కు ఫిర్యాదు చేశాడు. తెలియని లింకులు ఓపెన్ చేయొద్దని, OTP ఎవరికీ చెప్పొద్దని 2వ టౌన్ ఎస్సై యాదగిరి హెచ్చరించారు.