హైదరాబాద్: 28°C
వార్తలు

ఉజ్జయిని ఉత్సవాల్లో హ్యూమనాయిడ్‌ రోబో హల్‌చల్‌

ఉజ్జయినిలో మహాకాళి వార్షిక ఉత్సవాల్లో మానవ రూపంలోని రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందౌర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన ఈ హ్యూమనాయిడ్‌ రోబోను ఊరేగింపులో ప్రదర్శించారు. రామ్‌ఘాట్‌కు చేరుకున్న రోబోకు పూజారులు కంకణం, రుద్రాక్ష మాల, కాషాయ కండువా అలంకరించారు. అనంతరం సంస్కృత మంత్రాలు పఠిస్తూ భక్తులతో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది.