పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో వందేళ్ల పురాతన ఆలయాన్ని కూల్చివేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన మైనారిటీల మత స్వేచ్ఛ, ప్రార్థనా మందిరాల పరిరక్షణపై ఆందోళన కలిగిస్తోందని విదేశాంగశాఖ తెలిపింది. మైనారిటీల భద్రత, వారి సాంస్కృతిక వారసత్వానికి భరోసా కల్పించాలని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్‌వాల్ కోరారు.
వార్తలు
పాక్‌లో ఆలయం కూల్చివేతను ఖండించిన భారత్


