హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇద్దరికి శిక్ష

BDK: కొత్తగూడెం మండలంలో బుధవారం ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఇద్దరు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపరచగా కొత్తగూడెం 2వ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ రవికుమార్‌ రెండు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు.