హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీపై బృందా కరత్ ఫైర్

రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేసిన 'బుద్ధి-శుద్ధి' యజ్ఞంపై CPM నేత బృందా కరత్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది బీజేపీ 'మనువాద' అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. దళిత నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభ ముగిసిన వేదికపై కొందరు 'శుద్ధీకరణ' పేరిట వివక్ష చూపినా కనీసం కేసు పెట్టకపోవడం దారుణమన్నారు. ఈ చర్యలను బీజేపీ, RSS సమర్థించడం సిగ్గుచేటన్నారు.