హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. 12 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే వర్షాల కారణంగా 12 మంది మృతి చెందినట్లు SDRF వెల్లడించింది. పలుచోట్ల రహదారులు మూసుకుపోవడంతో రవాణా నిలిచిపోయింది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి.