హైదరాబాద్: 28°C
వార్తలు

ఏ. కొండూరులో రేషన్ షాపులు తనిఖీ

NTR: ఏ.కొండూరు మండలంలో ఆర్డీవో కుమార్ బుధవారం పర్యటించి గోపాలపురంలోని రేషన్ షాప్ నెం.11, కంభంపాడులోని రేషన్ షాప్ నెం.30ను తనిఖీ చేశారు. దీంతో రేషన్ షాపుల్లో ప్రజలకు అందిస్తున్న నిత్యవసర సరకులు, నిల్వలు, పంపిణీ విధానం, స్టాక్ రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులను పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు.