హైదరాబాద్: 28°C
వార్తలు

ఐఐటీ విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్

అస్సాంలోని ఐఐటీ గువాహటి విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఐఐటీ గువాహటి 33వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వం తరఫున 100 మంది విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ప్రకటించారు. తక్షణమే ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధి సమస్యలకు ఐఐటీ సాంకేతిక పరిష్కారాలు చూపాలన్నారు.