SKLM: ఆమదాలవలస పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం సాయంత్రం ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
'హెల్మెట్ లేకపోతే జరిమానా తప్పదు'


