అయోధ్య ట్రస్ట్‌కు సీఈవో నియామకంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. కొత్తగా సీఈవోని నియమించినంత మాత్రాన గతంలో జరిగిన తప్పులను మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. అయోధ్యలో జరిగిన విరాళాల దొంగతనం కేసులో కేవలం చిన్న ఉద్యోగులను మాత్రమే జైలుకు పంపి, వెనుక ఉన్న పెద్ద తలకాయలను వదిలేశారని ఆరోపించారు. ఇకనైనా విరాళాల చోరీ జరగకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు


