హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర హోదాను అడ్డుకునే కుట్ర: ఫరూక్ అబ్దుల్లా

కాశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు వస్తున్న బెదిరింపులు.. లోయలో భయాందోళనలు సృష్టించి J&Kకు రాష్ట్ర హోదాను అడ్డుకునే కుట్ర అని మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. స్థానిక అధికారులకు లేని బెదిరింపులు కేవలం పండిట్లకే ఎందుకు వస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఉగ్రవాదం అంతమైందంటున్న కేంద్రం ఉద్యోగులకు బెదిరింపుల అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.