హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎయిర్ మార్షల్

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి 'CEO'గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. అయోధ్యలో జరిగిన ట్రస్ట్ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత వైమానిక దళంలో సుమారు 39 సంవత్సరాల పాటు ఆయన సేవలందించారు. ఇటీవల వెలుగుచూసిన విరాళాల చోరీ ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చే బాధ్యతను ఆయన స్వీకరించనున్నారు.