TG: సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ అవాస్తవమని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థకు చెందిన భూగర్భ గనుల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని యాజమాన్యం ఖండించింది. ప్రస్తుతం 21 భూగర్భ, 17 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని వివరించింది. సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రత కోసం భూగర్భ గనులను కొనసాగిస్తామని పేర్కొంది.
వార్తలు
భూగర్భ గనుల ప్రైవేటీకరణపై స్పష్టత


